బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి, బతుకమ్మ: అధికారికంగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. మండల, జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బతుకమ్ వేడుకల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులను వేడుకల్లో భాగస్వాములను చేయాలన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. చెరువులు, కుంటలు తదితర నీటి వనరుల ప్రాంతాల్లో గజ...