26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పాడుబడ్డి బావిలో శవాలై తెలిన ఇద్దరు చిన్నారులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరు పిల్లల మిస్సింగ్ ఉదంతం విషాదాంతం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలో ఈ నెల 6న కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు పాడుబడిన బావిలో విగత జీవులై తేలారు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్ (9) ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. అదే రోజు బిఆర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు మిస్సింగ్ కాగా వారిని వాళ్ల తండ్రే పెద్ద చెరువులో పారేసి హత్య చేసినట్లు సీసీ టీవి పుటేజీలు పట్టించాయి. కానీ సింహద్రి, విజయ్ ల ఆచూకి కోసం గత 8 రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ టీవి పుటేజిలను పరిశీలించినా ఇద్దరు చిన్నారుల అచూకి దొరకలేదు. శనివారం రాజా నగర్ కాలనీలోని పురాతన బావిలో ఇద్దరు చిన్నారుల డెడ్ బాడిలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారి ఒంటిపైన ఉన్న దుస్తుల ఆధారంగా వారిని సింహాద్రి, విజయ్ లుగా గుర్తించారు. చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారా, మరేదైనా జరిగి ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ ఉదంతం విశాదాంతం కావడంతో రెండు కుటుంబాలకు పుత్రశోకం మిగిలింది.

 

Two children found dead in abandoned well

More articles

Latest article