నిజామాబాద్ క్రైం, బతుకమ్మ
ఓ పోలీస్ స్టేషన్ ముందు అనూహ్యంగా బైక్ దహనమైంది. గ్ధఈ సంఘటన సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం బైక్ దహనం కావడం గమనార్హం. బైక్ ను పోలీస్ స్టేషన్ గేటు ఎదుట నిలిపి పెట్రోల్ పోలీసు నిప్పంటించినట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియో సోషల్ మీడియా గ్రూప్ లో వైరల్ అయింది. బైక్ దహనం చేసింది యజమాని? లేక ఇతరులా అనేది తెలియరాలేదు. పోలీస్ స్టేషన్ ముందే బైక్ ను దహనం చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనేది అంతుచిక్కడం లేదు. బైక్ ను దగ్ధం చేసినప్పుడు స్టేషన్ లో అధికారులు ఉండడం గమనార్హం.అప్పుటికప్పుడు మంటలను ఆర్పివేశారు. బైక్ దహనం వెనుక గల కారణాలు ఏమిటనే చర్చ జరుగుతుంది.

