28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ మిషన్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, హాస్పిటల్ సిబ్బందికి త్రాగడానికి వాటర్ లేక ఎంతో ఇబ్బంది ఉండడాన్ని తెలుసుకొని వేసవి, ఎండలను దృష్టి లో ఉంచుకొని శివన్నోళ్ళ రాజు ప్యూరిఫై వాటర్ ఫిల్టర్ మిషన్ అందజేశారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన తన తండ్రి మాజీ సొసైటీ చైర్మన్ శివన్నోల్ల రాజన్న స్మారకార్థం తన స్వంత డబ్బులతో ఈ మిషన్ అందజేసినట్టు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ మిషన్ ని గురువారం ప్రభుత్వ డాక్టర్ అంబిక ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబిక మాట్లాడుతూ హాస్పిటల్ లో వాటర్ ఫిల్టర్ లేక చాలా ఇబ్బందిగా ఉండేదని, హాస్పిటల్ కు వచ్చే రోగులకు, అలాగే సిబ్బందికి త్రాగు నీటి సమస్య ఉండేదని అన్నారు. ఈ రోజుతో రోగులకు మంచినీటి సమస్య తీరినట్లు అయిందని సంతోషం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కు వాటర్ ఫిల్టర్ మిషిన్ తో సమస్య ను తీర్చినందుకు శివన్నోళ్ళ రాజు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, పి.హెచ్.ఎన్.ఇందిరా, మాజీ ఎంపీటీసీ సున్నపు అంజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పన్నాల నర్సారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జక్కని నరేష్, వైద్య సిబ్బంది కల్పన, పండరి, జక్కని ముత్తెన్న, రాము, శ్రీనివాస్, ప్రజలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article