25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగపరచుకోవాలి 

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విజ్ఞప్తి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

 ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచు కోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చిన్న చిన్న కేసులు , ట్రాఫిక్ చలానాలు , మైనర్ క్రిమినల్ కేసులు , సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చ న్నారు.అంతేకాకుండా ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కాబట్టి , పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కోర్టు లో గల కేసులలో త్వరగా పరిష్కారం చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article