28.9 C
Hyderabad

అంగన్ వాడి టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

అంగన్ వాడి  టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డిని సీఐటీయూ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిశారు. శుక్రవారం రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ వేతనం రూ.18,000 పెంపు,ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మార్చి నుండి ఒంటిపూట అంగన్వాడీ కేంద్రాలు నిర్ణయించడంతో పాటు పిఎఫ్ సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు,మౌలిక వసతులు తదితర అంశాలను గురించి ఎమ్మెల్యే కు విన్నవించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలను ప్రస్తావించాలని విన్నవించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

More articles

Latest article