27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు 

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నగరంలోని జాగృతి కార్యాలయంలో కవిత 48 వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో క్రియాశీలక పోషించిన కవిత తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుతూ బతుకమ్మ, బోనాల పండుగలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్ర నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. జాగృతి నాయకులు అవంతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చేసిన ఘనత కవితకక్కే దక్కుతుందన్నారు.కరోనా సమయంలో కోవిడ్ పేషెంట్లకు అండగా నిలబడ్డ కవితక్క, తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డి. ప్రవీణ్ కుమార్, హనుమగిరి, గట్టు హరికృష్ణ కుల్దీప్ పంచ రెడ్డి మురళి, శంకర్, శ్రీనివాస్ గౌడ్, రేఖ, సరిత, శ్రీకాంత్ నాయక్ తదితరులు తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article