26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళలను ప్రోత్సహిస్తే ఉన్నత పదవులు అధిరోహిస్తారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా బాలల సంరక్ష ణ అధికారి జక్క స్రవంతి పటేల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి కుటుంబంలో మహిళలను ప్రోత్సహిస్తే ఉన్నత పదవులను అధిరోహిస్తారని జిల్లా బాలల సంరక్షణ అధికారి జక్క స్రవంతి పటేల్ అన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ అండ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలకు ఉద్యోగ బాధ్యతలు, ప్రోత్సాహం మరింత అవసరమని, చట్టాలను, ప్రతి ఫలాలను క్షేత్ర స్థాయిలో అందించినప్పుడే మహిళలు ఉన్న స్థాయికి ఎదుగుతారని తెలిపారు. కుటుంబం, సమాజం సహకారం అందిస్తే ముందుకు సాగుతారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అండ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఇలా మహిళలను ప్రోత్సహించే దిశలో వారి సేవలను గుర్తించి సత్కరించడం అభినందనీయం అన్నారు. సంఘ అధ్యక్షుడు తోట రాజశేఖర్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే జగత్తు లేదని, స్త్రీ శక్తి అపారమైనదని, స్త్రీ శక్తిని గుర్తించి ఆదరిస్తే వారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారనే ఉద్దేశంతో ఈ రోజు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బుస ఆంజనేయులు పటేల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీందర్ పటేల్, కోశాధికారి భాశెట్టి సురేష్ పటేల్, మహిళా కార్యదర్శి స్వర్ణలత పటేల్, ఎండల స్వప్న పటేల్, సలహాదారులు చిట్టి నారాయణరెడ్డి పటేల్, అబ్బాయి లింబాద్రి పటేల్, జనార్దన్ పటేల్, ఉపాధ్యక్షులు రేంజర్ల నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, శేఖర్ పటేల్, తుమ్మల లక్ష్మణ్ పటేల్, ప్రతినిధులు సత్యనారాయణ పటేల్, అర్జున్ శేఖర్ పటేల్, నవీన్ పటేల్, సంఘ సభ్యులు పాల్గొని 30 మంది మహిళ మున్నూరు కాపు ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.

More articles

Latest article