28.8 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థుల మానసిక స్థాయి దేశ అభ్యున్నతికి పునాది రాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వర్సిటీ ఉపకులపతి టి. యాదగిరి రావు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ఒత్తిడిని సానుకూలంగా ఎదుర్కొనే విధానాలను విద్యార్థులు అలవరచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ, డిచ్‌పల్లి లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ సెమినార్ హాల్ లో బుధవారం స్టూడెంట్స్ సపోర్ట్ సెంటర్ (ఎస్ ఎస్ సీ), సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో “స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్” అనే అంశంపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 100-డే యాక్షన్ ప్లాన్ లో భాగంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సూర్య’స్ హెల్త్ ఆర్గనైజేషన్, నిజామాబాద్, ఆనంద మైండ్ కేర్, నిజామాబాద్ సంస్థల సహకారంతో నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి అతిథిగా పాల్గొని విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మానసిక ఆరోగ్యం కీలకమని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. రవీందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి తేజ ఇన్నమూరి (మెంటల్ హెల్త్ ఎక్స్ పర్ట్, ఆనంద మైండ్ కేర్), మిస్టర్ రాజేంద్ర కుమార్ విక్రమ్ (కో-ఆర్డినేటర్, సూర్య’స్ హెల్త్ ఆర్గనైజేషన్) వనరుల వ్యక్తులుగా పాల్గొని విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ సమతుల్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని డాక్టర్ కె. రాజేశ్వరి (అసిస్టెంట్ ప్రొఫెసర్ & బీవోఎస్, కో-ఆర్డినేటర్, స్టూడెంట్ సపోర్ట్ సెంటర్), డాక్టర్ అంజయ్య బండేలా (అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్, డిపార్డ్ మెంట్ ఆఫ్ సోషల్ వర్క్) సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఆసక్తిగా చర్చల్లో పాల్గొన్నారు.

More articles

Latest article