29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఈ ఏడాది జిల్లాలో 625 రోడ్డు ప్రమాదాలు

Must read

📰 Generate e-Paper Clip

  •  257 మంది రోడ్డు ప్రమాదాలలో బలి
  • జూన్ నుంచి తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు
  • స్పెషల్ డ్రైవ్ లే కారణం
  • నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ నెల వరకు 625 ప్రమాదాలు జరగగ దానిలో 257 మంది మరణించారు అని, అందులో జనవరి నెల నుంచి మే నెల వరకు 173మంది మరణించారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. జూన్ నెలలో నంబర్ ప్లేట్స్ లేనివి, నంబర్ ప్లేట్ సక్రమంగా లేకపోవడం, త్రిబుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా ప్రయాణించడం, మైనర్ డ్రైవింగ్ లాంటి వాటి మీద ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ , స్థానిక పొలీస్ శాఖ లు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేసి కేసులు బుక్ చేయడం వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు కేవలం 84 మంది మాత్రమే మరణించినట్లు తెలిపారు. 2022లో జనవరి నుండి సెప్టెంబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో 44 శాతం మంది మరణించగా, 2023లో 40 శాతం మంది అదేవిధంగా 2024లో 39 శాతం మంది మరణించారు. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి నిజమాబాద్ జిల్లాలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు 2800 పైచీలుకు కేసులు రూల్స్ ను అధిక్రమించిన వారి మీద బుక్ చేసి జరిమానాలు విధించారు. జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ , స్థానిక పొలీసు లు కలిసి హెల్మెట్ పై అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు చేయడం వల్ల గత నెల సెప్టెంబర్ లో కేవలం 13 మరణాలు మాత్రమే సంభవించినవి. కావున ద్విచక్రవాహనాలు నడిపే వాహనా దారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ జాగ్రత్తలు తీసుకోగలరని సిపి కల్మేశ్వర్ కోరారు.

More articles

Latest article