28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

“బార్” అధ్యక్ష పదవికి నీలకంఠ రావు నామినేషన్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 వార్షిక ఎన్నికలలో భాగంగా అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది నీలకంఠ రావు మంగళవారం రెండుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేష్వర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రాజారెడ్డి, దయాకర్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, మంతెన రాజేందర్ రెడ్డి, అజార్ కిషన్ రావు, రాజలింగం, రాజ్ కుమార్ సుబేధార్, జక్కుల వెంకటేష్వర్, శ్రీహరి ఆచార్య, వి. భాస్కర్, ఎన్. ఎల్ శాస్త్రి, దాదన్నగారి మధుసుధన్ రావు, యునస్ ఖాన్ లు వెంటరాగా నీలకంఠ రావు నామినేషన్ వేయాడానికి బయలుదేరారు. వారి సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారులు ఆమిడాల సుదర్శన్, మెట్టు నరేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్బంగా నీలకంఠ రావు మాట్లాడుతూ న్యాయవాదులందరి ఆశీస్సులతో అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినట్లు తెలిపారు. వెంటనడిచిన, వెన్నుతట్టి ప్రోతహిస్తున్న న్యాయవాద కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గంగా ప్రసాద్, కర్తన్ గణేష్, బాస రాజేష్వర్, చంద్రశేఖర్ గౌడ్, వినాయక్, ఆశ నారాయణ, రవి ప్రసాద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Neelakanta Rao's nomination for the post of "BAR" president

More articles

Latest article