29 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీరామ కాలనీలో ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ :  ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శ్రీరామ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ వారల్కర్ సంపత్ శర్మ ఆధ్వర్యంలో నిత్యం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తి అమ్మవారి చండి హోమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కాలనీ కమిటీ సభ్యులు అన్నదాన సత్రాన్ని నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా నిర్వహిస్తూ, విజయదశమి వరకు అమ్మవారి స్వరూపాలు, వివిధ రకాల నైవేద్యాలతో ఉత్సవాలు జరపనున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షుడు అరె రాజేశ్వర్, కార్యదర్శి కరాటే భోజన్న, కాలనీ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article