. . . మూడు తులాల బంగారు గొలుసు రికవరీ
. . . ప్రజల తోడ్పాటుతో గొలుసు దొంగను పట్టుకుని రిమాండ్ కి తరలింపు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి పట్టణంలో మహిళ మెడలోనుంచి బంగారు గొలుసును తెంపుకుని పరారీ అవుతున్న దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రజలు సహకరించడంతో నిమిషాల వ్యవధిలో స్పందించిన పొలీసులు చైన్ స్నాచర్ ను పట్టుకుని గొలుసు రికవరి చేయడమే కాకుండా రిమాండ్ కి పంపినట్టు పట్టణ సిఐ నరహరీ తెలిపారు. కామారెడ్డి పట్టణ సిఐ నరహరి కథనం ప్రకారం… కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయి పేటకు చెందిన భారతీ (56) అనే మహిళ అదివారం సాయంత్రం కూరగాయలు కొనుగొలు చేసి నడుచుకుంటు వెలుతుండగా స్టేషన్ రోడ్డులోని డిసిబి బ్యాంక్ వద్ధ మద్ధికుంట గ్రామానికి చెందిన గుండేబోయిన స్వామి ఆమె పై దాడి చేసి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారీ అయ్యాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు మధు, కళ్యాణ్ లు తక్షణం స్పంధించి సినిమా పక్కిలో స్థానికుల సహాయంతో స్వామిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.4.80 లక్షల విలువైన మూడుతులాల పుస్తేల తాడును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శించి చైన్ స్నాచర్ ను పట్టుకున్నపోలీస్ కానిస్టేబుళ్లు మధు, కళ్యాన్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. గుండే బోయిన స్వామిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు సిఐ నరహరీ తెలిపారు.
