27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భిక్కనూరు వద్ద ప్రైవేట్ బస్సులో పొగలు..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తప్పిన పెను ప్రమాదం

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

సదాశివనగర్ మండలం కుక్రియ గ్రామానికి చెందిన 60 మందితో హైదరాబాద్ లోని వివాహానికి హాజరు కావడానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో పొగలు రాగా బస్సులో కూర్చున్న పలువురు ఆ విషయాన్ని బస్సు డ్రైవర్ దృష్టికి తీసుకు వెళ్ళగానే బస్సును పక్కనకు నిలపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామానికి చెందిన 60 మంది హైదరాబాద్ లోని పెళ్లి హాజరు కావడానికి ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా భిక్కనూరు మండలం బేసిక్ వద్ద బస్సు టైర్ల సమీపంలో పొగలు వచ్చాయి. బస్సులోని కొందరు గమనించి బస్సు డ్రైవర్ కు తెలుపగా వెంటనే బస్సును 44 జాతీయ పక్కన అంతంపల్లి  గ్రామ శివారులో నిలిపాడు. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులు అందరూ వెంటనే బస్సు దిగి పరిశీలించగా బస్సులో పొగలు ఎక్కువయ్యాయి. స్థానిక పోలీసులు చేరుకొని ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించి బస్సును పరిశీలించారు. బస్సు డ్రైవరు హ్యాండ్ బ్రేక్ ను తీయకపోవడం వల్లనే రాపిడికి టైర్ల వద్ద పొగలు వచ్చాయని గమనించారు. పరిస్థితిని ఫైర్ ఇంజన్ సిబ్బంది అదుపులోకి తీసుకురాగా పెళ్లి బృందాన్ని వేరే బస్సులో హైదరాబాద్ కు తరలించారు.

More articles

Latest article