రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్) గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మలకు పూజలు నిర్వహించి ప్రధాన కూడలీ వద్ద బతుకమ్మలను ఒకే చోట ఉంచి బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
