27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హోలీ పండుగ రోజే విషాదం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి

 

బతుకమ్మ బోధన్ :

 

హోలీ పండుగ రోజు విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మంజీరా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.పోలీసుల కథనం ప్రకారం, సాయికుమార్, రోనీ చౌదరి అనే స్నేహితులు హోలీ వేడుకల అనంతరం సాలురా సమీపంలోని మంజీరా నదికి స్నానానికి వెళ్లారు. నదిలో లోతు అంచనా వేయకపోవడంతో ఇద్దరూ ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో శోధన చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పండుగ రోజే జరిగిన ఈ దుర్ఘటనతో ఆచన్‌పల్లి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

More articles

Latest article