29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మూసీ నది ఆక్రమణలపై మాజీ ఎంపీ కవిత ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటం

 

. . . ఇది పేదల ప్రభుత్వం కాదు.. పెద్దల ప్రభుత్వం

 

. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నార్సింగిలో మూసి నది ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజలందరికి న్యాయం ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటమని అన్నారు. అక్రమంగా పెద్దలకు పర్మిషన్లు ఇచ్చి, పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని కవిత వాపోయారు. మూసీలో పేదవాళ్ల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారని, అదే మూసీ నదిలో భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనబడటం లేదని, రంగనాథ్ కి ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పారని, ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు కూడా మేమంతా ఇక్కడే ఉంటామని తెలిపారు. జనం బాటలో భాగంగా చెరువులు, నదులు అక్రమించి కట్టిన బిల్డింగ్ ల గురించి కంప్లైంట్స్ ఇచ్చామని, కానీ ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని, ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారని, దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన ఆ అపార్ట్ మెంట్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే కడుతున్న, ఎవరికీ నష్టం లేని బిల్డింగ్ ను మాత్రం ఆపటం లేదని మండిపడ్డారు. మాకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదని, ప్రభుత్వంతోనే మా పంచాయితీ అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలను ఆపారని, కానీ ఆ తర్వాత ఆమ్యమ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని పేర్కొన్నారు.

 

Former MP Kavitha dharna against Musi River encroachments

 

అలాగే పోలీసులు బలప్రయోగంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయమని, పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని, అదే వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారని మండిపడ్డారు. రేపు అయినా హైడ్రా బుల్‌డోజర్లు ఇక్కడికి వస్తేనే రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తామని, ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నదని, ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు.

More articles

Latest article