. . . డీసీపీ బసవ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
పీఎం రాహత్ స్కీములో ప్రతి ఆక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుండి 1,50,000 వరకు లేదా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని డీసీపీ బసవ రెడ్డి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొదలవుతున్న పీఎం రాహత్ స్కీం మీద సోమవారం నిజామాబాద్ లో గల ఐడిఓసి ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాలులో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల ఆరోగ్యశ్రీ మిత్రలకు, ఆపరేటర్లకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎం రాహత్ స్కీం కి ఆరోగ్య మిత్రల సహకారం ఉండాలని, వారు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని, బాధితులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ట్రైనింగ్ ఇచ్చిన ఈదార్ మేనేజర్ వర్షాన్నిహందు మాట్లాడుతూ తొందరగానే మన జిల్లాలో ఈ స్కీం మొదలవుతుందని ఈ స్కీములో పోలీసు వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు సమన్వయంతో పని చేయవలసి ఉంటుందని తెలిపారు. అదే విధంగా స్కీము కూడా పోలీసు వారు, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతోనే ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ లో జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, డీఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ శశాంక్ రెడ్డి, సుపరిండెంట్ భాస్కర్, ఆరోగ్యశ్రీ మిత్రలు, ఆపరేటర్లు పాల్గొన్నారు.

