23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళల ఉపాధిపై దెబ్బ తీస్తే ఊరుకునేది లేదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి. గోదావరి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మహిళల ఉపాధి పై దెబ్బతీస్తే మహిళలు, పేద ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తారని పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. ఆదివారం కోటగల్లి లోని ఎన్ ఆర్ భవన్ లో పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8న జరగబోయే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్నివిజయవంతం చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి. గోదావరి, ఏ. సంధ్యారాణి మాట్లాడుతూ మార్చి 1 నుండి 8 వరకు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పేద మహిళలకు చేయూతనిచ్చే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నదని ఈ రద్దుకు వ్యతిరేకంగా మహిళల యొక్క ఉపాధిని కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలను, ప్రజాస్వామిక వాదులను కోరారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్య్లూ జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి, కోశాధికారి విపాష, జిల్లా నాయకులు కీర్తన, సునంద, నర్సక్క, రెహానా, ఆశలత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article