28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

1వ వార్డులో పారిశుధ్య పనులు వేగవంతం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజా సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్ నస్రీన్ ఫిరోజ్ ఖాన్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ నస్రీన్ ఫిరోజ్ ఖాన్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. వార్డులో పనిచేయని వీధి దీపాల మరమ్మత్తులు, మురికి కాలువల శుభ్రత, పారిశుధ్య పనులను స్వయంగా దగ్గరుండి నిర్వహింపజేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాంతాన్ని పరిశీలిస్తూ, సమస్యలు ఉన్న చోట వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. వార్డు పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డును మరింత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కౌన్సిలర్‌ను స్థానిక కాలనీ వాసులు అభినందిస్తున్నారు.

Sanitation work accelerated in Ward 1

 

More articles

Latest article