. . . ఇదేనా రైతు రాజ్యం..?
. . . యూరియాకు ఆన్ లైన్ బుకింగ్ పెట్టొద్దు
. . . సొసైటీ ముందు ఆందోళన చేస్తున్న రైతులు
. . . ఇదే పునరావృతమైతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర నాయకులు పాశంకుమార్
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ప్రాథమిక సహకార సంఘంలో యూరియా కోసం రైతులు బారులు తీరడం ఆసక్తికరంగా మారింది. యూరియా కోసం ఆన్లైన్ బుకింగ్ నిర్వహించడం పట్ల రైతులకు యూరియా కొరత నిరాశకు గురి చేస్తుందన్నారు. అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా రైతు రాజ్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో హామీలు ఇస్తూ, గత కొన్నేళ్లుగా రైతులను మోసం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. హామీలు ఇచ్చి రైతులతో చెలగాటాలు ఆడడం ఎంతవరకు న్యాయమని రైతులు, ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యూరియా కొరతను వెంటనే అరికట్టేందుకు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను రద్దు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి సహకార సంఘం వద్ద మండలానికి చెందిన ఆయా గ్రామాల రైతులు ఆందోళన చేస్తూ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు. చివరికి రైతుల రాజ్యం చేయకున్నా సరే కానీ, రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. లేదంటే యూరియా కొరతనైనా లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. ఇకనైనా రైతులకు యధావిధిగా యూరియాను ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండా సరఫరా చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై జి సందీప్ ఇందల్వాయి సహకార సంఘం సొసైటీ వద్దకు వచ్చి ధర్నా నిర్వహిస్తున్న రైతులతో మాట్లాడి ధర్నా ఆపించారు. దీనిపై సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాశంకుమార్, తాజా మాజీ ఎంపీటీసీ మరంపల్లి సుధాకర్, గ్రామ పెద్దలు లచ్చా రెడ్డి, నామాల గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ లింగంపల్లి రాజేందర్, గొల్ల శ్రీనివాస్ కల్వరాల రఘుపతి రెడ్డి, బుట్టి మాణిక్యం, దండు ప్రకాష్, ఉప్పల్ వై రఘుపతి, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
