26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం అన్నారు. ఆజాద్ చంద్రశేఖర్ 94 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని కోటగల్లి ఎన్ ఆర్ భవన్ లో ఆయన చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించిన వీరుడు కామ్రేడ్ ఆజాద్ చంద్రశేఖర్ అని, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగాః హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికం ఆర్మీని స్థాపించి భారతదేశంలో బ్రిటిష్ పాలకుల దోపిడి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాడని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి దోపిడీకి పాల్పడుతున్నారని గుత్తా పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ప్రజలకు కనీస వసతులు కూడు, గూడు, నీడ ఇవ్వాల్సింది పోయి వారిని దోపిడికి గురి చేస్తున్నారని, ఈ దోపిడీ పీడనలేని సమ సమాజ స్థాపన కోసం పోరాడినప్పుడే ఆజాద్ చంద్రశేఖర్ కు నిజమైన నివాళులని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పీవైఎల్ నగర అధ్యక్షులు టి.భాస్కర్, రాజు, ఐఎఫ్టీయు నగర సహాయ కార్యదర్శి మోహన్ శంకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article