29 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ తిరుమల దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దేవనాధ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవానికి ముందుగా నిర్వహించిన హోమ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస రెడ్డి సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా పోచారం కుటుంబ సభ్యులు పోచారం శంభు రెడ్డి, ప్రేమ దంపతులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సోని రెడ్డి దంపతులు, పోచారం సురేందర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

 

Brahmotsavams continue in grandeur at Tirumala Temple in Telangana

 

More articles

Latest article