29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు

 

. . . యశోద హాస్పిటల్ వైద్యులు పి. ప్రకాష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రమాదవశత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నట్లు యశోద హాస్పిటల్ (హైటెక్ సిటీ) వైద్యులు పి. ప్రకాష్ వెల్లడించారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మెడ, భుజాల గాయాలపై  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బ తినటం, ఈ బ్రేక్యల్ ప్లేసెస్ ఇంజురీతో చేతి నరాలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. అందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల వలన గాయాలు కావడం చాలా సాధారణమన్నారు. ముఖ్యంగా ఈ నరాల గాయాలు యవ్వనంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్లలో ఈ గాయాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. ఇలా నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరియైన చికిత్స అవగాహన లేకపోవడం వలన వైద్యున్ని సంప్రదించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారన్నారు. సరియైన సమయంలో నరాలకి సంబంధించిన సర్జరీ చేయడంలో దానికి సంబంధించిన ఫలితాలు రావడంలో చాలా తేడా ఉంటుందన్నారు. ఇలాంటి నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన సమయంలో సరైన వైద్యున్ని సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాలన్నారు. నరాల గాయాలు అయిన వ్యక్తుల చేతిలో కదలికలు ఉండకపోవడం, చేతిలో స్పర్శ లేకపోవడం దాని వలన చేయి చచ్చుబడినట్టుగా ఉండడం లేదా భుజము భాగం పని చేయకపోవడం , మోచేయి (ఎల్బో) మాత్రమే పని చేయకపోవడం, పూర్తిగా భుజం నుంచి చేతి వరకు పని చేయకపోవడం లాంటి రకరకాల ఇబ్బందులతో నరాల తీవ్రతని బట్టి లక్షణాలు ఉంటాయన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు చాలామంది వైద్యున్ని సంప్రదించడంలో జాప్యం చేస్తూ ఫిజియోథెరపీ చేయకుండా సరియైన సమయంలో వైద్యం తీసుకోకపోవడం వలన తగినంత ఫలితాలు చూడలేకపోతుంటామన్నారు. చేతి నరాలు దెబ్బతిన్నప్పుడు నరాల శస్త్ర చికిత్సలు చేసే వైద్యులని కలిసి నరాలకు సంబంధించి తగిన వైద్యం పొందితే సరైన సమయంలో తిరిగి చేతికి కదలికలు, స్పర్శ రావడంతో తన పనులు తను స్వతహాగా చేసుకునే స్థితికి తీసుకురావచ్చన్నారు. చికిత్సలో భాగంగా దెబ్బతిన్న నరాలకి ఆపరేషన్ ద్వారా నరాలని, తెగిన నరాలని జోడించడం కానీ లేదా తెగిన నరాలకి వేరే నరాలను జోడించడం, కండరాలను జోడించడం వల్ల టెండన్ ట్రాన్స్ ఫర్ అనే సర్జరీ ద్వారా నరాల తీవ్రతను బట్టి ఏ సమయంలో దెబ్బతిన్న నరాల కాలపరిమితిని బట్టి పైన చెప్పబడిన సర్జరీలు చేస్తే తిరిగి నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు డాక్టర్ పి ప్రకాష్ (ప్లాస్టిక్ అండ్ రికాన్స్ట్రక్టివ్ సర్జన్, బ్రేకెల్ ప్లేసెస్ సర్జన్) యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ హైదరాబాద్ పాల్గొని అవగాహన కల్పించారు.

More articles

Latest article