. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లోనే కాకుండా భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆకాంక్షించారు. 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్- 2026 మెడల్స్ సాధించిన సిబ్బందికి సోమవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మెడల్స్ అందజేస్తు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 16 నుండి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 లో నిజామాబాద్ పోలీస్ విభాగానికి చెందిన సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచారన్నారు. వివిధ విభాగాలలో పాల్గొన్న సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్ , 9 బ్రోంజ్ మెడల్స్ సాధించారని తెలిపారు. పోలీస్ విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా పోలీస్ శాఖకు పేరు తేవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (ఎ.ఆర్) రామచంద్రరావు, పథకాలు సాధించిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
