నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు నిజామాబాద్ పట్టణంలోని గోనెరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతంగా ముగిసాయని ఎఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా బానోత్ రఘురాం నాయక్ తెలిపారు. ఈ మహాసభలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కౌన్సిల్ లో నిజామాబాద్ జిల్లా నుండి 4 గురికి చోటు దక్కిందన్నారు. ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా బానోత్ రఘురాం నాయక్, రాష్ట్ర సమితి సభ్యులు గా సుభోద్, అనూష, కార్తీక్ లు నియమించబడ్డారని ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కౌన్సిల్ సభ్యులుగా 69, ఆహ్వానితులుగా నలుగురు, మొత్తం 73 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఈ సమితి రాబోయే మూడు సంవత్సరాల పాటు విద్యారంగ సమస్యల పైన నిరంతరం పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు.
