వార్షిక పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయి

0 8,977

 

. . . విద్యార్థులు బాగా చదివి, పరీక్షలు బాగా రాయాలి

 

. . . ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి

 

. . . జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఘనంగా ఫేర్ వేల్ పార్టీ

 

జుక్కల్, బతుకమ్మ :

 

ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలు సీసీ కెమెరాల నీడలో జరుగుతాయని, విద్యార్థులు బాగా చదివి పరీక్షలు బాగా రాయాలని జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి అన్నారు. వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించి తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అన్నారు. బాగా చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. అనంతరం జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు మాట్లాడుతూ మంచి ర్యాంకులు సాధించి జూనియర్ కాలేజ్ పేరును నిలబెట్టాలని అన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

 

Annual examinations are conducted under the supervision of CCTV cameras.
Annual examinations are conducted under the supervision of CCTV cameras.

ఈ కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, బస్వాపూర్ సర్పంచ్ వెంకటరమణ సురేష్ గొండ, జుక్కల్ ఉప సర్పంచ్ షేక్ ఫిర్దౌస్, బస్వాపూర్ ఉప సర్పంచ్ అనిల్, ఎక్స్ ఏఎంసీ చైర్మన్ సాయ గౌడ్, మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ పాండురంగ, కామారెడ్డి గెజిటెడ్ అధ్యాపకుల సంఘం ప్రెసిడెంట్ గంగాధర్, ఏఏపిసి చైర్మన్ మాధవి, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Annual examinations are conducted under the supervision of CCTV cameras.

Leave A Reply

Your email address will not be published.