26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా  పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన 37వ డివిజన్ కార్పొరేటర్ ప్యాట విజయ లక్ష్మికి, 37వ డివిజన్ అధ్యక్షులు ప్యాట సంతోష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మెన్ దాదాన్న గారి విఠల్ రావు, పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, సత్య ప్రకాశ్, సుజిత్ సింగ్, దండు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

 

 

KCR's birthday celebrated in grand style at BRS party office

More articles

Latest article