27.3 C
Hyderabad
Friday, July 31, 2026

తెలంగాణ రాష్ట్ర సాధనలో కే‌సీఆర్  పాత్ర చారిత్రాత్మకమం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్

 

ఆర్మూర్, బతుకమ్మ  : 

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో కే‌సీఆర్  పాత్ర చారిత్రాత్మకమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని బీ ఆర్ ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  జన్మదిన సందర్బంగా ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి చేశారు. ఈ సందర్భంగా  పూజ నరేందర్  మాట్లాడుతూ కేసి ఆర్ ప్రజల సంక్షేమం కోసం ఆయన చూపిన దారిలోనే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కే‌సీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆర్మూర్ పట్టణంలో కేక్ కటింగ్ చేసి , పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ,బి.అర్.ఎస్.కౌన్సిలర్ లు నా దీమ్,పృద్వి,అజిమ్, సీనియర్ నాయకులు సుంకరి రవి, మీరా శ్రవణ్, మందుల పోశెట్టి, రమేష్ బి అర్.ఎస్.పార్టీ ఆర్మూర్ మండల యువజన అధ్యక్షులు అగ్గు క్రాంతి, టౌన్ ఎస్సి సెల్ అధ్యక్షులు జన్నెపల్లి రంజిత్, మైనార్టీ నాయకులు మాలిక్ బాబా, ఆరిఫ్ ఖాన్, ఖరీం నాయకులు  రామ్, కళ్యాణ్ తదితరులున్నారు.

KCR's role in achieving Telangana statehood is historic

 

More articles

Latest article