30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్,  బతుకమ్మ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.  నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు,కార్యకర్తలు తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వారి సమస్యల పట్ల వెంటనే స్పందించారు.  గ్రామ పంచాయతీ భవనం, మైనారిటీలకు కబరస్థాన్ కు కంపౌండ్ వాల్, రోడ్డు, బ్రిడ్జి, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు.

Distribution of CMRF Cheques

More articles

Latest article