సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజాంసాగర్, బతుకమ్మ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు,కార్యకర్తలు తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వారి సమస్యల పట్ల వెంటనే స్పందించారు. గ్రామ పంచాయతీ భవనం, మైనారిటీలకు కబరస్థాన్...