24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ బల్ధియాపై ఎగిరే జండా ఎవరిదో?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అతిపెద్ద పార్టీగా బీజేపీ . . . రెండవ స్థానానికి పరిమితమైన కాంగ్రెస్

 

. . . 13 సీట్లకు పరిమితమైన ఎంఐఎం

 

. . . కారు పార్టీకి ఒక్కటే సీటు

 

. . . మేయర్ ఎంపికకు కీలకం కానున్న ఎక్స్ ఆఫిషియో ఓట్లు

 

నిజామాబాద్ , బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి కూడా 60 డివిజన్ లలో మేయర్ స్థానం కైవసం చేసుకునేందుకు 35 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయాయి. శుక్రవారం ప్రకటించిన కౌంటింగ్ ఫలితాలలో బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ కొన్ని స్థానాలను తక్కువ మెజార్టీతో ఓటమి చెందింది. ఆ పార్టీలో గతంలో కార్పొరేటర్లుగా చేసిన వారు కూడా బీజేపీ గత పాలకవర్గం మాదిరిగానే 28 స్థానాలకు పరిమితం కావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఎక్స్ అఫిషియో ఓట్లు ఐదు ఉన్నప్పటికి మ్యాజిక్ ఫిగర్ కు చేరువ కాని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస పార్టీ 18 స్థానాలను గెలచుకుని 2వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కూడా ఓటమి పాలుకావడం గమనార్హం. 60 డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ చాలా మంది పెద్ద లీడర్లు పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. మజ్లీస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. గతంలో 16 సీట్లు ఉన్న మజ్లీస్ పార్టీ 11 సీట్లకు తగ్గడం విశేషం. గత రెండు పర్యాయాలు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న మేయర్ పార్టీ ఒకే ఒక సీట్ కు పరమితమైంది. కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ తో కలిసి మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలనుకున్న ఎక్స్ అఫిషియో ఓట్లు కలిసిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా? బీజేపీకి మద్దతు ఇస్తారా? అని మేయర్ ఎంపికలో కీలకం కానుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. ఈ నెల 16 వరకు రాజకీయ సమీకరణలు మారితే ముందుగా బీజేపీకే మేయర్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

More articles

Latest article