31 C
Hyderabad

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి:  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. మాచారెడ్డి మండలంలోని భవాని పేట తాండా కు చెందిన బానోతు రాములు అనే వ్యక్తి ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నాడని, పక్కా సమాచారం మేరకు చుక్కాపూర్ బస్టాండ్ వద్ద పట్టుకుని 2.09 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

More articles

Latest article