25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 11 న జరగనున్న భీంగల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా మంగళవారం ఆయన భీంగల్ లో గల ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత భీంగల్ మున్సిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం పోలింగ్ బూతులను పర్యవేక్షించారు. ఈ పోలింగ్ బూతుల వద్ద ప్రజలు ఎవరు కూడా గుమిగూడకుందా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, సి.టి.సి ఎ.సి.పి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, భీంగల్ సి.ఐ పొన్నం సత్యనారాయణ, భీంగల్ ఎస్సై తిరుపతి, కమ్మర్ పల్లి ఎస్సై అనిల్, మోర్తాడ్ ఎస్సై రాము, ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, ఎం.పీ.డీ.వో గంగుల సంతోష్ కుమార్, ఎం.ఆర్.ఓ ఎం.డి షబీర్, ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

 

Care should be taken to avoid any untoward incidents.

More articles

Latest article