29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సెలవు ప్రకటన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న (బుధవారం) నాడు పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పై మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం  వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఎన్నికల పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 10 (మంగళవారం) నాడు కూడా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా, ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాల్స్ గా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు లెక్కింపునకు ముందు రోజు అయిన ఫిబ్రవరి 12 (గురువారం) రోజున, కౌంటింగ్ నిర్వహించబడే ఫిబ్రవరి 13న (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

More articles

Latest article