నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్ ల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఐఎన్టీయూసీ అధ్యక్షులు మల్యాల గోవర్థన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాస్పటల్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్, ఆఫీస్ సిబ్బంది కి ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వేతనాలు అందే విధంగా చూస్తానని మహేష్ కుమార్ గౌడ్ కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ హాస్పిటల్ కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు యాదమ్మ, కార్యదర్శి శ్రావణ్, నాయకులు సావిత్రి, ముంతాజ్, గండెమ్మ, తదితరులు పాల్గొన్నారు.
