పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పీసీసీ అధ్యక్షునికి వినతి

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్ ల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఐఎన్టీయూసీ అధ్యక్షులు మల్యాల  గోవర్థన్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్  లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాస్పటల్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్, ఆఫీస్ సిబ్బంది కి ఆరు నెలలుగా వేతనాలు...