24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒకటో వార్డు అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించి గెలిపించండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గైనియాదవ్

 

బిచ్కుంద, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ ఒకటవ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఒకటవ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గైని యాదవ్ అన్నారు. శనివారం ఒకటవ వార్డు లో ఆయన మాట్లాడుతూ వార్డ్ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. తనను గెలిపిస్తే వార్డ్ లో ప్రతి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా 1116, అలాగే వార్డులో ఎవరైనా మృతి చెందినట్లయితే బిఆర్ఎస్ పార్టీ భరోసాగా 5000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అనంతరం వార్డు పెద్దల సమక్షంలో తాగునీటి సమస్యను తీర్చుటకై సొంత ఖర్చులతో బోర్లు వేయిస్తానన్నారు. అలాగే స్మశాన వాటికలో ఉచితంగా బోరు వేస్తానన్నారు. కనుక వార్డు ప్రజలంతా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఒకటవ వార్డు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article