27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నైతిక విలువలు లేని అభ్యర్థులను బ్యాలెట్ ద్వారా శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నైతిక విలువలు లేని అభ్యర్థులను బ్యాలెట్ ద్వారా శిక్షించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ పన్ను బకాయిలు చెల్లించని నరేందర్ రెడ్డి, ఇప్పుడు ఎన్నికల్లో పోటి చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రూ.8.16 కోట్ల బకాయిలను చెల్లించారని అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి పై  ఎంపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ భారీ మొత్తాన్ని కట్టించిన ఘనత బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు. పన్నులు కట్టకుండా ఇందూరు ప్రజలను మోసం చేసిన ఇలాంటి వ్యక్తులు మేయర్ పీఠంపై కూర్చుంటే, రేపు మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లను వ్యాపారమయం చేస్తారని ఆందోళన వ్యకం చేశారు. మేయర్ పదవి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, గెలిచిన తర్వాత అంతకంటే ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇలాంటి వారి నుంచి ఇందూరు ప్రజలను ఆ శ్రీరాముడే కాపాడాలన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసమే రాజకీయాలు చేస్తుందని, దానికి సిద్దాంతాల పట్ల చిత్తశుద్ది లేదని అర్వింద్ ఆరోపించారు. బీజేపీ ఎన్నడూ హిందుత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోలేదని, అది తమ జీవన విధానమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీది హిందూ వ్యతిరేక విధానమని, అందుకే తాను ఆ పార్టీలో చేరలేదని వెల్లడించారు. హిందుత్వం అనేది కేవలం ఎన్నికల నినాదం కాదని, అది మా డీఎన్ఏలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎన్నికలు రాగానే బీజేపీకి హిందుత్వం గుర్తుకు వస్తుందన్న కాంగ్రెస్ అభ్యర్థుల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.పార్టీ పట్ల అంకిత భావం ఉన్న నేతలకు మాత్రమే టికెట్ల కేటాయింపులో పెద్ద పీట వేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఈ సారి టికెట్లు నిరాకరించామని ఆయన కుండ బద్దలు కొట్టారు. బీజేపీ తిరస్కరించిన నేతలను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుని టికెట్టు కట్టపెట్టడం హాస్యస్పదం అన్నారు. బీజేపీ గెలిస్తే వచ్చే ప్రతి రుపాయి ప్రజల శ్రేయస్సు కోసమే ఖర్చు చేస్తామని  హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కంటే సోనియా గాంధీ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని అర్వింద్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా సోనియా గాంధీ తో మా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నప్పటికి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాల వల్లే నేను ఆ పార్టీకి దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు.  పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలన వచ్చిన 11 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించామని వెల్లడించారు. కేవలం పార్టీ మారినంత మాత్రాన టికెట్లు దక్కవని, తమ తమ డివిజన్ల లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ, నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించిన వారిని మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేశామని ఆయన వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తదితరులున్నారు.

More articles

Latest article