25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రత్యేక పశు వైద్య శిబిరం ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

పశు వైద్య కళాశాల కోరుట్ల ఎన్ఎస్ఎస్ విభాగం, పశు వైద్య, పశు సంవర్ధక శాఖ తెలంగాణ, నిజామాబాద్ జిల్లా లయన్స్ క్లబ్ బోధన్ వారి ఆధ్వర్యంలో రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ అఫ్రీన్ బేగం-ఖాదర్ చేతుల మీదుగా ప్రత్యేక పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ పశువైద్య శిబిరంలో వివిధ వైద్య నిపుణుల సమక్షంలో అనేక రకాల జబ్బులకు, ఆరోగ్య సమస్యలకు, చర్మ వ్యాధి పరీక్షలు, పేడ పరీక్షలను నిర్వహించారు. గర్భకోశ నిపుణుల సమక్షంలో తొలి దశ గర్భ చూడి నిర్ధారణ ను కూడా అల్ట్రా సౌండ్ స్కానర్ ద్వారా 12 పశువులకు నిర్ధారణ చేశారు. 19 గేదెలకు, 22 ఆవు దూడలకు, 15 గేదె దూడలకు, 105 గొర్రెలకు, 15 మేకలకు నట్టల నివారణ కొరకు మందులను త్రాగించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్, రుద్రూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్, వివిధ వైద్య నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ మల్లేష్, డాక్టర్ అరుణ, జూనియర్ వెటర్నరీ డాక్టర్స్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ సాయి రాజ్, గోపాలమిత్ర హనుమండ్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article