25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యలు లేని వార్డుగా తీర్చిదిద్దుతాను… ఆశీర్వదించండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ అన్నారు. సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలోని 11వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, 11వ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.  ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో 11వ వార్డును అభివృద్ధి చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తామని అన్నారు. ఆపదలో ఆదుకుంటూ 11వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ తోటే మున్సిపల్ పరిధిలోని వార్డులన్నీ అభివృద్ధి చెందుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందజేసిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సొంతంటి కల నెరవేరుతుందని, గ్రామాల్లో చెరువులు నిండడంతో రైతుల సంతోషంగా ఉన్నారని అన్నారు. పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అన్నారు.

More articles

Latest article