26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర స్థాయి అండర్ 20 క్రికెట్ పోటీలకు జిల్లా యువతుల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఎ)  ఆధ్వర్యంలో, వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్ 20 క్రికెట్ అసోసియేషన్ పోటీలకు నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ ఇంటర్, డిగ్రీ మహిళా విభాగం లో వివిధ కళాశాలల నుంచి 19 మంది యువతులు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల క్రికెట్ క్రీడాకారులు ఈనెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరంగల్లో జరిగే ఈ పోటీలో పాల్గొననున్నారు. ఈ నెల 7వ తేదీన జరిగే ఫైనల్ లో జిల్లా క్రికెట్ జట్టు అర్హత సాదిస్తుందని, ఈ పోటీలకు ఎంపికైన యువతులు బాగా రాణించాలని క్రికెట్ టోర్నమెంట్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

More articles

Latest article