24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గాంధీ ఎంచుకున్న మార్గము దేశానికే దిక్సూచి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

గాంధీ ఎంచుకున్న మార్గము దేశానికే దిక్సూచి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ అన్నారు.  రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 77 వ వర్థంతిని నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ మాట్లాడుతూ.. గాంధీ ఎంచుకున్న మార్గము దేశానికే దిక్సూచి అని, సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రము అందించిన మన జాతిపిత మహాత్మ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, దౌడ్ సాయిలు, కరోల్ల వెంకట్, పార్వతి ప్రవీణ్,శంకరి వీరయ్య, నేరేడు సాయిలు, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article