గాంధీ ఎంచుకున్న మార్గము దేశానికే దిక్సూచి
రుద్రూర్, బతుకమ్మ : గాంధీ ఎంచుకున్న మార్గము దేశానికే దిక్సూచి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ 77 వ వర్థంతిని నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ మాట్లాడుతూ.. గాంధీ ఎంచుకున్న మార్గము దేశానికే దిక్సూచి అని, సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రము అందించిన...