30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబానికి ఎన్ఆర్ఐ ఆర్ధిక సహాయం అందజేత…

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చందా బుధవ్వ అనారోగ్యంతో మరణించడంతో, స్థానిక బీజేపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి తన వంతు ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, బాన్సువాడ బీజేపీ సీనియర్ నాయకులు కటిక రామరాజు, రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు భోజిగొండ అనిల్, రేపల్లె సాయి ప్రసాద్, అంబం గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article