25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలు ముఖ్యమే

Must read

📰 Generate e-Paper Clip

. . . మండల స్థాయి సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలి.

 

. . . ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్

 

భీంగల్, బతుకమ్మ

 

విద్యార్థులకు చదువుతో పాటు నిజ జీవితంలో క్రీడలు కూడా ముఖ్యమేనని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని యు పీ ఎస్ బాబాపూర్ స్కూల్ లో సీ. ఎం కప్ 2026 మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు వాలీ బాల్,  ఖో ఖో పోటీలు నిర్వహిస్తారని, గురువారం కబడ్డీ, అథ్లెటిక్స్ ను నిర్వహిస్తారన్నారు. ఈ క్రీడలలో గెలుపొందిన వారికి ప్రైజ్ లు పంపిణీ చేసి అట్టి టీం లను నియోజకవర్గ స్థాయి పోటీలకు నామినేట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సదావకాశాన్ని విద్యార్థులు, యువతీ, యువకులు వినియోగించుకొని క్రీడలలో రాణించాలని కోరారు. సీఎం కప్ లాంటి క్రీడా పోటీలు నిజమైన క్రీడాకారులను వెలికి తీయడానికి దోహదం చేస్తాయని అన్నారు. గెలుపు ఓటములన్నింటిని క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంఈఓ స్వామి, ఎంపీఓ జావీద్, సర్పంచ్ లు సమీర్, రమేష్, శేఖర్ ఉప సర్పంచ్ గోవర్ధన్, పాఠశాల హెచ్ఎం శేఖర్, పీడీ, పీఈటీలు భూపతి చిన్నయ్య మహిళా పీ.డీలు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, అన్నీ గ్రామాల కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

Sports are important for students along with education.

More articles

Latest article