27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రూరల్ ప్రజలకు ఆపదలో అండగా…

Must read

📰 Generate e-Paper Clip

. . . 2 వేల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు అనారోగ్యం పాలై హాస్పిటల్లలో చికిత్స పొందే సమయంలో డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. బుధవారం కంటేశ్వర్ బైపాస్‌లో గల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన 2 వేల దరఖాస్తులపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి సంతకాలు చేశారు. నియోజకవర్గంలో ఆర్థికంగా బలహీన వర్గాలు అధికంగా ఉన్న కారణంగా, వారు అనారోగ్యం కారణంగా ఆస్పత్రులలో చికిత్స సమయంలో అవసరమైన ఖర్చులను భరించలేకపోతున్నారని, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్ అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజలను దేవుళ్లుగా భావించి సేవ చేయడమే తన ధ్యేయమని ఆయన అన్నారు.

More articles

Latest article