28.8 C
Hyderabad
Monday, August 3, 2026

అనుమతుల్లేకుండా కళాశాల బ్రాంచ్‌లు

Must read

📰 Generate e-Paper Clip

. . . తక్షణమే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

 

. . . ఆర్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ హిట్ల నరేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ కళాశాలలు అదనపు బ్రాంచ్‌లను అనుమతులు లేకుండా నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని ఆర్ వై ఎఫ్ (రెవల్యూషనరీ యూత్ ఫ్రెండ్) జిల్లా కన్వీనర్ హిట్ల నరేష్ అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కి ఆర్ వై ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతిచ్చిన బ్రాంచ్ లతో పాటు ఎస్ఆర్, ఆల్ ఫోర్స్ కళాశాలలు అదనంగా అనుమతులు లేని బ్రాంచ్‌లను నడుపుతున్నాయని, ఇవి పూర్తిగా అక్రమమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్ ఆర్, ఏవీఆర్ దాస్ నగర్, ఆల్ ఫోర్స్ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న బ్రాంచ్‌కు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అధికారులను మోసం చేస్తూ, విద్యార్థులను మభ్యపెడుతూ అక్రమంగా నిర్వహిస్తున్న ఈ బ్రాంచ్‌లను తక్షణమే సీజ్ చేసి, సంబంధిత కళాశాల యాజమాన్యాలపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ వై ఎఫ్ డిమాండ్ చేసింది. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article