25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉత్తమ ప్రిన్సిపాల్ గా సయ్యదా ఆర్షీ ఇక్బాల్

Must read

📰 Generate e-Paper Clip

. . . గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం స్వీకరణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర గురుకుల పాఠశాల, కళాశాల డిచ్ పల్లిలో గత 5 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న సయ్యదా ఆర్షీ ఇక్బాల్ కు ఉత్తమ ప్రిన్సిపాల్ గా ఎన్నికయ్యారు. సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ సయ్యదా ఆర్షీ ఇక్బాల్  ప్రశంసా పత్రాన్ని పొందారు. డిచ్ పల్లి బాలుర మైనార్టీ కళాశాలలో గత 3 సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించగా రాష్ట్ర స్థాయిలో 3,6,12వ ర్యాంకులను సాధించారు. ఈ కళాశాల నుంచి ఉత్తర్ణీత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్ పొందారు. అగ్నివీర్ కేంద్ర సర్వీసులతో పాటు కొందరు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పొందారు. పాఠశాల స్థాయిలో కూడా ఎస్సెస్సీలో అద్భుతమైన ఫలితాలను సాధించారు. ట్రైబల్ ద్వారా నియామకమైన సయ్యదా ఆర్షీ ఇక్బాల్ 16.03.2021లో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు.

More articles

Latest article