ఏర్గట్ల, బతుకమ్మ :
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు అన్నీ గ్రామాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏర్గట్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జె మల్లయ్య, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై, లక్ష్మణ్ నాయక్, ఎంపిడిఓ కార్యాలయం లో ఎంపీఓ శివ చరణ్, గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఉన్న జెండా వద్ద కాంగ్రెస్ పార్టీ ఏర్గట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పూర్ణానందం, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రభుత్వ పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు కొమిరిగిరి కృష్ణ చారి,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అమలా,జాతీయ జెండా ను ఎగురవేసి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ స్థానిక మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

